ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో 10 మంది చిన్నారులు సజీవదహనమైన విషయం తెలిసిందే. ‘‘తమ పిల్లల మృతితో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తుంటే.. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్‌కు సాదర స్వాగతం పలికేందుకు రోడ్లు శుభ్రం చేసి, సున్నం చల్లుతున్నారు’’ అంటూ కాంగ్రెస్ ఓ వీడియోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. చిన్నారుల మరణం కంటే తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మండిపడింది.