హైదర్‌షా కోట్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్ళు కూల్చొద్దు అంటూ పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో 'మా ఇళ్లను కాపాడండి, మా భవిష్యత్తును రక్షించండి' అంటూ ఒక చిన్న పాప ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపింది. "మాకు న్యాయం కావాలి. మా ఇల్లు మాకు కావాలి. మా భవిష్యత్తుని కాపాడండి. మాకు దయచేసి సహాయం చేయండి." అంటూ ఆ చిన్నారి ప్రభుత్వాన్ని కోరింది.