ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం 'దేవర' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా యాంకర్ సుమ నిర్వహించిన ఓ ఇంటర్వ్యులో తారక్ పాల్గోన్నారు. రాజమౌళితో సినిమా చేసిన అనంతరం ఆ హీరో మూవీ ఫ్లాప్ అవుతుందని ఒక టాక్.. దీనిపై మీరేమంటారు అని సుమ, తారక్‌ను అడిగింది. 'మనం సరిగ్గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళిని అంటుంటాం. రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి తర్వాతి సినిమా పోతే ఆయన మీద తోసేస్తాం' అని తారక్ అన్నారు.