మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని సౌల్ల తండ గ్రామంలో శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గోశాల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10 మంది రైతులకు ఆదివారం సాయంత్రం సమయంలో లేగ దూడలను తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అగర్వాల్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్టీ నుంచి కనీసం 5 ఎమ్మెల్యే మరియు ఎంపీ టికెట్లను గోరక్షకులకు కేటాయించాలన్నారు.