వరంగల్ మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రంను శనివారం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆటారి పదవ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా, విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ మహేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉపకరణలైన బ్యాటరీ పంపులు, టార్పాలిన్ షీట్లు, పిపిఈ కిట్లు, కోనో విడర్లు, గ్రైండర్లలను రైతులు, మహిళలు, యువకులకు అందజేశారు.