దోషులు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా శిక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ జిల్లా తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలియజేశారు. ఇటీవలే కొడంగల్ లో జిల్లా అధికారిపై జరిగిన ఘటనను ఎమ్మెల్యే నాయిని తీవ్రంగా ఖండించారు. దోషులు ఎవరైనా పార్టీలకు అతీతంగా శిక్షించాలని తెలిపారు.