బాలలదినోత్సవం సందర్బంగా గురువారం హనుమకొండలోని స్పందన వికలాంగులు, బధిరుల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పుస్తకాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. అంగవైకల్యం అనేది దేహానికి మాత్రమేనని వారి మనసుకు వారి బుద్ధికి కాదని అంగవైకల్యం కలిగిన చిన్నారులను చేరదీయడం వారికి చేయూత అందించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.