తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో అధికారుల పై జరిగిన దాడికి నిరసనగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వరంగల్ జిల్లా పక్షాన గురువారం నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జేఏసీ చైర్మన్ గజ్జల రామ్ కిషన్ పాల్గొని మాట్లాడుతూ ఇటీవల జరిగిన అధికారుల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.