అక్షరాలను పదునెక్కించి అణచివేతను, వివక్షను ఎదిరించి నిలిచిన ధీశాలి వట్టికోట అని శుక్రవారం మంత్రి పేర్కొన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం, గ్రంథాలయోద్యమం మొదలు స్వాతంత్రయోద్యమం వరకు వట్టికోట ప్రతి పోరాటంలోనూ అద్వితీయమైన పాత్ర పోషించారని మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం కోసం రచయితగా, పాత్రికేయునిగా, గ్రంథాలయోద్యమాల నాయకుడిగా తన జీవిత సర్వస్వాన్ని అర్పించిన ధన్యజీవి ఆళ్వారుస్వామి అని మంత్రి సురేఖ కీర్తించారు.