వరంగల్: ప్రజాక్షేత్రంలో పోరు విత్తనాలు జల్లి ఉద్యమాలను ఉరకలెత్తించిన చైతన్య దీప్తి, పోరాటస్ఫూర్తి వట్టికోట ఆళ్వారుస్వామి అని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వట్టికోట ఆళ్వారుస్వామి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సమాజానికి వారు అందించిన సేవలను మంత్రి సురేఖ గురువారం స్మరించుకున్నారు. కలాన్ని ఖడ్గంగా ప్రయోగించి, అక్షరాలను పదునెక్కించి అణచివేతను, వివక్షను ఎదిరించి నిలిచిన ధీశాలి వట్టికోట అని పేర్కొన్నారు.