పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో స్వీప్ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించే యాక్షన్ ప్లాన్లో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నవంబర్ 1వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఓటరు చైతన్య కార్యక్రమాలు ఉంటాయన్నారు.