తక్కువ నీటితో అధిక దిగుబడులు తీసేందుకు బిందు సేద్యం ఎంతగానో ఉపకరిస్తోందని, ఈ పద్ధతి వల్ల నీటిని ఆదా చేయడంతో పాటు అధిక ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. గురువారం గీసుగొండ మండలం మొగిలిచర్ల, స్తంభంపల్లి గ్రామంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు అమలు చేస్తున్న బిందు సేద్యం విధానాన్ని పరిశీలించి, దరఖాస్తు చేసుకున్న రైతులకు పరికరాలు మంజూరు చేయాలని ఆదేశించారు.