పాలకుర్తి: పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఇందులో భాగంగా సిబ్బంది చేపడుతున్న గృహాల గుర్తింపు, గృహానికి స్టిక్కరింగ్ వేస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ రాకేష్ తనిఖీ చేశారు.