నర్సంపేటలో లంబాడి హక్కుల పోరాట సమితి సభ్యులు శనివారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి తేజావత్ వాసు నాయక్ హాజరై మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీల పేరుతో అన్యాయంగా లంబాడీల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ విషయం పై అరెస్ట్ అయిన లంబాడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.