వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టులో రెగ్యులర్ న్యాయమూర్తిని నియమించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సృజయ్ పాల్కికి వినతి పత్రం అందజేశారు. అనంతరం బార్ అసోసియేషన్ నాయకులు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సంపేటలో మూడు కోర్టులకు రెగ్యులర్ న్యాయమూర్తి లేకపోవడం వలన కక్షిదారుల కేసులు త్వరగా పరిష్కారం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.