వయోవృద్ధుల సంఘ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట గ్రామంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ వారితో ఐ క్యాంప్ నిర్వహించారు. గ్రామంలోని సుమారు వందమంది మహిళలు మరియు వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు. వృద్ధులకు కంటి శుక్లాల పరీక్షలు చేసి కొందరు పేషెంట్ లను ఆపరేషన్ లకు సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో కంది గోపాల్ రెడ్డి, అధ్యక్షులు ఈగ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ములుక సాంబయ్య పాల్గొన్నారు.