తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంత్రి సీతక్క మహారాష్ట్రలో జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు తినిపించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.