వాజేడు మండలం రాంపూర్ ఇసుక క్వారీ నుండి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రధాన రహదారిపై ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న క్రమంలో దుమ్ము ధూళితో పక్కనే ఉన్న మిర్చి, ఇతర పంటలు నష్టపోతున్నామని రైతులు వాపోయారు. వందల ఎకరాల మిర్చి పంట సాగు చేస్తున్న రైతులు దుమ్ము కారణంగా కొత్త రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.