ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు, పర్యాటకులు మేడారంలో గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు చుట్టు పక్కల చెట్ల కింద విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా పరిసరాలలో సేద తీరుతీరారు. అనంతరం వారివారి స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు.