ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ బానోత్ రవిచందర్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంకో 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.