సంగెం మండలం కాట్రపల్లి నుండి వరంగల్ కు వెళ్ళే ప్రధాన రహదారిలో గ్రామం చివరలో వాగు వద్ద ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు కొట్టుకుపోయి పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిపోయి ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వానికి వంతెన ఏర్పాటు చేయాలని విన్నవించున్నప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ప్రజలు శనివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.