మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గ్రామం శివారు గాదె వాగు వంతెన వద్ద వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జితో పాటు దాని ఇరువైపులా ప్రధాన రహదారి మొత్తం పూర్తిగా దెబ్బతిని గుంతలమయం అయింది. రోడ్డు బాగా లేకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యారు. కొత్తగూడ మండలానికి చెందిన జేఎల్ఎన్వైసి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెల రణధీర్ కమిటి సభ్యులు తమ గాదే వాగు వంతెన ఇరువైపుల రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు.