దీపావళి పండుగ నాడు రైతులకు వర్షం కడగండ్లు మిగిల్చింది. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుండటంతో చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదని తిట్టుకుంటున్నారు. కొట్టుకుపోయిన వడ్లను దోసిళ్లతో ఏరుకున్నారు. మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపెల్లిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రైతులు నిండా మునిగిపోయామని వాపోయారు.