డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం గాలివాన భీభత్సాన్ని సృష్టించింది. ఈ గాలి వానతో గ్రామ ప్రజలు, చిన్న పిల్లలు భయాందోళనకు గురి అయ్యారు. కొన్ని చోట్ల రేకులు ఊడి ఎగిరిపోయి కింద పడ్డాయి. ఈ గాలి దుమారానికి విద్యుత్ స్తంభం ఇరిగింది. ఇలాంటి గాలివానను ఎప్పుడు చూడలేదని గ్రామ ప్రజలు అన్నారు. అరగంట సేపు ఈ గాలివాన ఆగకుండా వచ్చింది. చెట్లు కూడా విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.