సారాయి, బెల్లం కేసుల పట్టుబడ్డ వాహనాలను బహిరంగ వేలం వేస్తున్నట్లు సోమవారం మహబూబాబాద్ ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి తెలిపారు. ఈ వేలం పాటను ఈ నెల 24న మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ తో పాటు, కురవి, సీరోల్, డోర్నకల్, గార్ల, బయ్యారం, పోలీస్ స్టేషన్లలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలం పాటలో పాల్గొనదల్చిన వారు ఒకరోజు ముందు వచ్చి వాహనాలను చూసుకోవాలని వారు తెలిపారు.