డోర్నకల్ మండలంలోని డోర్నకల్, ఉయ్యాలవాడ, వెన్నారం, తోడేళ్ళగూడెం, ముల్కలపల్లి, రావిగూడెం తదితర గ్రామాలలోని పలు వీధుల్లో గురువారం వినాయకుడి మండపాలను యువత ముస్తాబు చేస్తున్నారు. యువత, పిల్లలు కలిసి కర్రలను కడుతూ. మండపాలను ముస్తాబు చేస్తున్నారు. ఎల్లుండి వినాయక చవితి పండుగ మొదలవుతున్న సందర్బంగా గ్రామాలలో సందడి వాతావరణం నెలకొననుంది. ఎల్లుండి నుండి వినాయకుడు తొమ్మిది రోజులు పూజలు అందుకోనున్నాడు.