కాలేశ్వరం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత
భూపాలపల్లి మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. ఆదివారం గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. 10. 440 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ల పై నుంచి వరద కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి 6, 79, 900 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నడంతో 85 గేట్ల ద్వారా అధికారులు దిగువ వదులుతున్నారు.