సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు 6, 7 తేదీల్లో ఇండ్ల జాబితాను తయారు చేయాలని మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం నుండి హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, సూపర్ వైజర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.