దుద్యాల: సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా దుద్యాల జీపీ దగ్గర సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తో కలిసి సర్వే సిబ్బందితో మాట్లాడారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి తప్పులు లేకుండా వివరాలు పొందుపరచాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే పై అధికారులతో నివృత్తి చేసుకోవాలన్నారు.