బొంరాస్ పేట మండలం ఏర్పుమళ్ళ గ్రామానికి చెందిన బోయిని పద్మమ్మ, బుడగ జంగం చంద్రమౌలికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోలిస్ అంజిల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకట్ రాములు గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని, కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడుతుందన్నారు.