మహమ్మదాబాద్: వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే. యం నారాయణ, మాజీ యంపిపి శాంతిరంగ్య నాయక్ అన్నారు. ఐకెపి ఆధ్వర్యంలో చౌదర్ పల్లి, మంగంపేట్, మోకర్లాబాద్, దేశాయి పల్లి, జులపల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.