చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కులక్చర్ల ఎస్సై అన్వేష్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ వికారాబాద్ ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం కుల్కచెర్ల పీఎస్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలీస్ స్టేషన్ పనితీరు, క్రిమినల్ చట్టాలు, సైబర్ మోసాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.