ఏపీ ప్రభుత్వం దీపావళి నుంచి దీపం-2 పథకం ద్వారా ఉచిత సిలిండర్ పంపిణీని ప్రారంభిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు మొదటి ఉచిత సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చన్నారు. నాలుగు నెలలకోసారి ఉచిత సిలిండర్ అందిస్తామన్నారు. సిలిండర్ ఇంటికి చేరిన 48 గంటల్లోగా వినియోగదారుల ఖాతాలో రాయితీ డబ్బులు జమ అవుతుందన్నారు.