ప్యాసింజర్ రైలులో పేలుడు.. పలువురికి గాయాలు

62பார்த்தது
ప్యాసింజర్ రైలులో పేలుడు.. పలువురికి గాయాలు
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్‌తక్‌లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది. రైల్వే సిబ్బంది ప్రయాణికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.

தொடர்புடைய செய்தி