చౌడాపూర్ మండల కేంద్రంలో మంగళవారం 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రభులు, మండల అధ్యక్షులు అశోక్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ మొగులయ్య, వైస్ చైర్మన్ నాగరాజు, శివరాం నాయక్, కులకచర్ల మండల అధ్యక్షులు ఆంజనేయులు, సలీమ్, శేఖర్, గ్రామ కాంగ్రేస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.