కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల దాడిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో అధికారులపై దాడి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మంగళవారం నిందితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దీని తరువాత కోడంగల్ మెజిస్ట్రేట్‌లో హాజరుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.