గోషామహల్: సైబర్ నేరగాళ్లకు సాయం చేస్తున్న 38 మంది అరెస్ట్
సైబర్ నేరాల్లో కీలక నిందితులకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న 38 మంది ఖాతాదారులను బుధవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక 10 మంది ఏజెంట్లను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాతాలు సమకూర్చిన వారంతా దేశవ్యాప్తంగా 2 ,194 నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. అందులో తెలంగాణలో 508 మంది నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.