అమోయ్ కుమార్ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు బాధితులు సోమవారం హైదరాబాద్లోని ఈడీ అధికారులను కలిశారు. రంగారెడ్డి కలెక్టర్గా గతంలో పని చేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని శంకర్స్టాల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వట్టినాగులపల్లిలోని 460ఎకరాల్లో 3, 333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.