నగరంలో దీపావళి సందడి మొదలైంది. ధీపాంతులు, టపాసుల విక్రయాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ లోని హాల్ సెల్ మార్కెట్ అయిన బేగంబజార్ లో టపాసుల కోసం కొనుగోలుదారులు బారులు తీరారు. క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 7 గంటల సమయంలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావంతో బేగంబజార్ నుంచి కోఠీ రూట్ లో ట్రాపిక్ జామ్ అయింది. పోలీసులు ఎప్పటికప్పుడు వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.