సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ నిర్వహించగా.. బాలయ్య ఊర్వశీ రౌతేలాతో మాస్ సెప్టులు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా ఊర్వశీ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. శ్రద్ధ శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు.