రాజస్థాన్లోని కరన్పూర్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 110 ఏళ్లు బతికి చనిపోయాడని కుటుంబీకులు తమ బాధను దిగమింగుకుంటూ సంతోషంగా వీడ్కోలు పలికారు. అయితే పెళ్లి రేంజ్లో కారును అలంకరించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో mmtaa5519 అనే ఇన్స్టా ఖాతాలో షేర్ చేయబడింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.