సీతారామ పనుల్లో రానున్న ఆర్నెళ్లు కీలక సమయమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. త్వరగా పనులు చేస్తే పంటకాలానికి నీరందించే అవకాశం ఉందని చెప్పారు. సచివాలయంలో ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష చేపట్టారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు నిధులు, పరిపాలన అనుమతులు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రతి 15 రోజులకు పనులపై అధికారులు వివరాలు అందించాలన్నారు.