మెదక్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. గత నెల 23న చిన్నశంకరంపేటలో ఓ యువకుడిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి హత్య చేశారు. ఆదివారం పద్మనాభస్వామి గుట్ట వద్ద బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి యువకుడిని హత్య చేశారు. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరి దారుణ హత్యలు జరగటం.. రెండు హత్యలు ఒకే విధంగా ఉండటంతో ఇద్దరినీ ఒకే వ్యక్తి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.