విద్యాబుద్దులను నేర్పించాల్సిన ఓ టీచర్ ఫుల్లుగా మద్యం సేవించి స్కూల్ కి వస్తున్న ఘటన సూర్యాపేట జిల్లా మోతె (M) రామాపురం తండాలో జరిగింది. తండాలోని స్కూల్ లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ఉన్న ఉపేందర్ ప్రతి రోజు మద్యం, దూమపానం సేవించి పాఠశాలకు వస్తాడని.. అక్కడే తాగి పడుకుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఉపేందర్ ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.