తుంగతుర్తి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కోటచలం
సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం శనివారం తుంగతుర్తి మండలం రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. పి. హెచ్. సి పరిధిలో జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విశ్లేషించారు. జాతీయ టీకాల కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించి ఎన్ సి డి కార్యక్రమం గురించి వైద్యాధికారిని వివరాల అడిగి ఎన్ సి డి స్క్రీనింగ్ వంద శాతం పూర్తి చేయాలని తెలియజేశారు.