యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం ధర్మారం గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. సన్నాలకు 500 రూపాయల బోనసును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.