తుంగతుర్తి: సమాజాన్ని నాశనం చేస్తున్న ద్రోహులను శిక్షించాలి
తెలంగాణ సమాజాన్ని నాశనం చేయాలని చూస్తున్న ద్రోహులను, వారిని కాపాడుతున్న కేటీఆర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలను చూస్తే తెలంగాణ ప్రజానీకం తలదించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. రేవ్ పార్టీలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు.