ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: మన్నూరు నాగన్న

300பார்த்தது
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: మన్నూరు నాగన్న
విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వమే, హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలను మూసివేసే ప్రక్రియను ప్రారంభించడం అమానుషం. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియను అసంబద్ధంగా నిర్వహించుచున్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలి లేదా సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను కేటాయించి పిల్లల్లో అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించేలా చూడాలి. అది చేయకుండా ఈ కరోనా సమయంలో పిల్లలు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేసే ప్రక్రియను ప్రారంభించి బడుగుబలహీన వర్గాల వారికి విద్యను దూరం చేయొద్దు. వెంటనే ఇటువంటి చర్యలు మానుకోవాలని తెలంగాణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నూరు నాగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి నర్సరీకి, ఎల్కేజీ కి, యూకేజీకి అదనపు ఉపాధ్యాయులని కేటాయించాలి అని డిమాండ్ చేసారు.

అప్పుడు మాత్రమే విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్ధ్యాలు సాధించవచ్చు. అలాగే పిల్లలందరినీ ప్రభుత్వ బడులకు ఆకర్షించవచ్చు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయిస్తూ 1+5 చొప్పున 1 హెడ్ మాస్టర్ పోస్టును ఇస్తే ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. లేక పోతే "ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది " అనే సామెత లాగా ఉంటుంది మన విద్యావ్యవస్థ పరిస్థితి.

ఇప్పటికైనా ప్రభుత్వం నిజాలు గ్రహించి ప్రతి పాఠశాలకు అవసరం అయిన మౌలిక వసతులను సమకూర్చి, మన పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లాగా అన్ని వసతులు కల్పించి ఆ తరువాత కూడా విద్యార్థుల సంఖ్య పెరుగక పోతే అప్పుడు చెయ్యాలి హేతుబద్దీకరణ. హేతుబద్దీకరణ అనే సాకుతో ప్రభుత్వం సత్వరమే ఇవ్వవలసిన ప్రమోషన్లు, బదిలీలను కాలయాపన చెయ్యడానికి వేసిన ఎత్తుగడగా మాత్రమే. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించి ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పందిరి రవీందర్రెడ్డి, మల్లికార్జున్, రామకృష్ణ, సుధాకర్, ఉపేందర్, రవీందర్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி