సూర్యాపేట మండల పరిధిలోని దాస్ తండ గ్రామం లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం గ్రామ సర్పంచ్ నూనవత్ విజయ మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా దాస్ తండ గ్రామ సర్పంచ్ నూనవత్ విజయ మోతిలాల్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాస్ తండ ఉప సర్పంచ్ మేగవత్ బుజ్జి బాలు , వార్డు మెంబర్లు , గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.