పోలీస్ స్టేషన్ సమీపంలోని బేకరిలో చోరీ
కోదాడ పోలీస్ స్టేషన్ కి సమీపంలోని ఓ బేకరీలో మంగళవారం రాత్రి చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బేకరీ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం. రోజు మాదిరిగానే రాత్రి తాళం వేసుకొని వెళ్ళామని, ఉదయం వచ్చే వరకు షట్టర్ తాళం పగలగొట్టి ఉందని, లోపలికి వెళ్లి చూడగా 5వేల నగదు, కొంత సరుకు చోరీ జరిగిందని తెలిపారు. బేకరీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలం పరిశీలించారు.